![]() |
![]() |

"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో "నువ్వు, నేను ప్రేమ" సీరియల్ టీం ఇంకా "కలిసి ఉంటే కలదు సుఖం" టీమ్స్ వచ్చి పోటీ పడ్డాయి. ఇందులో నువ్వు, నేను ప్రేమ సీరియల్ టీం నుంచి విక్రమాదిత్యని స్టేజి మీదకు పిలిచింది శ్రీముఖి. ఇక అతనితో తెలుగు "అ, ఆ"లు బోర్డు మీద రాయిస్తుంది. అంతలో ఊ అక్షరం వచ్చేసరికి "ఊ అంటావా మావా" అనే పాటందుకుంది శ్రీముఖి. ఇంతలో ఎక్ష్ప్రెస్స్ హరి మధ్యలో వచ్చి "ఊ" అంటే ఏమిటి అని అడిగేసరికి " ఉడతలు పట్టే శ్రీముఖి" అని ఆన్సర్ ఇచ్చాడు విక్రమాదిత్య. ఆ మాటకు షాకైపోయింది శ్రీముఖి.
ఇక సీరియల్ యాక్టర్ ప్రకాష్, యాంకర్ శ్రీముఖి అంతు చూడడానికి ఈ గ్యాప్ లో ఒకతన్ని ట్రెయిన్ చేసాను అంటూ ఫుల్ ఎమోషనల్ డైలాగ్ చెప్పాడు అవినాష్. ఇక కేజీఎఫ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో విక్రమాదిత్య సెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. "ఏంట్రా బాబు రోజు ఇంతమంది అందమైన హీరోలు వస్తుంటే మాలాంటి అందమైన అమ్మాయిలు ఏమైపోవాలి " అనే డైలాగ్ చెప్పింది శ్రీముఖి..."స్వామి మీకోసం ఒకటి చెప్పనా అంటూ పుష్పాలో " అమ్మీ అమ్మీ అనే సాంగ్ కి డాన్స్ చేసింది శ్రీముఖి. ఇలా ఈ రెండు టీమ్స్ నెక్స్ట్ వీక్ ఎంటర్టైన్ చేయడానికి రెడీ ఐపోయాయి.
![]() |
![]() |